– కార్యవర్గ సభ్యులుగా ముజీబ్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జీఈఎఫ్) జాతీయ ఉపాధ్యక్షు లుగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, కార్యవర్గ సభ్యులుగా ప్రధాన కార్య దర్శి ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐఎస్‌జీఈఎఫ్ 18వ జాతీయ సమావేశాలు మహారాష్ట్రలోని షిరిడీలో ఈనెల 23 నుంచి 26 వరకు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి చర్చించారు. వాటి పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలను చేపట్టాలని తీర్మానం చేశారు. ఈ సమావేశాలకు జాతీయ అధ్యక్షులు సుభాష్ లాంబ, ప్రధాన కార్యదర్శి ఏ శ్రీకుమార్ నేతృత్వం వహించారు.
అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఏఐఎస్‌జీఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులుగా, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేని ముజీబ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి ముత్యాల సత్య నారాయణ గౌడ్‌లు జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. తెలంగాణ నుంచి నలుగురికి జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు జాతీయ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులకు టీఎన్జీవోల పక్షాన మారం జగద్వీర్, ముజీబ్, వెంకటేశ్వర్లు, సత్య నారాయణగౌడ్ ఉద్యమ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. వచ్చేనెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీఎన్జీవోల సంఘం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్నామనీ, ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.
ఏఐఎస్‌జీఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులుగా మారం జగదీశ్వర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



