Tuesday, September 23, 2025
E-PAPER
Homeసినిమాసీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా 'మర్దానీ 3'

సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా ‘మర్దానీ 3’

- Advertisement -

నవరాత్రి శుభారంభం సందర్భంగా యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ‘మర్దానీ 3’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంచి, చెడుకి జరిగే పోరాటాల్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. రాణి ముఖర్జీ తనకు ఎంతో ఇష్టమైన, ప్రేమించిన డేర్‌ డెవిల్‌ పోలీస్‌ శివానీ శివాజీ రాయ్‌ పాత్రలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహిషాసురుడిని చంపినప్పుడు దుర్గా మాత శక్తిని తెలిపే ‘అయిగిరి నందిని’ శ్లోకంతో రిలీజ్‌ చేసిన పోస్టర్‌ అదిరిపోయింది. ఓ కేసుని పరిష్కరించడానికి, దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే శివానీ సంకల్పం ఎలాంటిదో ఈ పోస్టర్‌ చెప్పకనే చెబుతోంది.
మర్దానీ (2014), మర్దానీ 2 (2019) వంటి భారీ విజయాల తర్వాత ఈ మూడో అధ్యాయం ప్రేక్షకులకు సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ను ఇచ్చేలా తెరకెక్కిస్తున్నారు. అభిరాజ్‌ మినావాలా దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -