నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 45 కేసుల్లో నిందితుల నుండి స్వాధీనంచేసుకున్న ప్రభుత్వ నిషేధిత 14.945 -కిలోల గంజాయిని ఎన్ డి పి ఎస్ చట్ట ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ… ఎన్ డి పి ఎస్ యాక్ట్ లోని నియమనిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదు చేయబడిన గంజాయిని దహనం చేయడం జరిగిందని,జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని,గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసిన, అమ్మిన, సేవించిన కఠిన చర్యలు తప్పపవని హెచ్చరించారు.
జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల కళాశాలల్లో పాఠశాలల్లో ప్రజల్లో,ఆవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అక్రమ గంజాయి రవాణాపై నిరంతరం నిఘా ఉంచుతూ నార్కోటిక్ జాగిలలతో విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎవరైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే పోలీస్ వారికి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, డీసీఆర్బీ సి.ఐ నాగేశ్వరరావు, ఆర్.ఎస్.ఐ రాజు, సిబ్బంది ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి దహనం: ఎస్పీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES