Wednesday, January 28, 2026
E-PAPER
Homeక్రైమ్గంజాయి చాక్లెట్లు స్వాధీనం

గంజాయి చాక్లెట్లు స్వాధీనం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గంజాయి స్మగ్లర్ల ముఠా తన ఆగడాలను కొనసాగిస్తూనే ఉంది. యువతను మత్తులో ముంచెత్తి, తద్వారా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎక్సైజ్‌శాఖ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) పోలీసులు గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఎస్టీఎఫ్‌ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీనితో వారు నేషనల్‌ హైవే 65లోని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట ఔటర్‌ రింగ్‌రోడ్‌ అండర్‌పాస్‌ వద్ద దాడులు చేశారు. ఈ సందర్భంగా 6జీ హోండా యాక్టివా ద్విచక్రవాహనం సీటు కింద 670 గ్రాములు ఉన్న 120 డ్రైగంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని, గంజాయి చాక్లెట్లను సీజ్‌చేసి, తదుపరి దర్యాప్తు కోసం కేసును పెద్దఅంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే ఈ కేసులో నిందితులకు అరెస్టు చేసిందీ లేనిదీ ఎస్టీఎఫ్‌ పోలీసులు వెల్లడించలేదు. దీనికి సంబంధించిన ఇతర సమాచారం చెప్పేందుకు ఎక్సైజ్‌ అధికారులు కూడా నిరాకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -