- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఇటీవల నమోదైన గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్న ఒకరిని అశ్వారావుపేట పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఎస్.హెచ్.ఓ ఎస్ఐ టి.యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం .. గంజాయి రవాణా చేస్తూ ఈ నెల 8న అశ్వారావుపేటలో పట్టుబడి అరెస్టు చేసిన 7గురు నిందితులకు, గంజాయి సప్లై చేసిన ఒడిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా కు చెందిన గంజాయి వ్యాపారి రామును ఆదివారం అశ్వారావుపేట బస్ స్టాండ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించి, నిందితుడి వద్ద నుండి గంజాయి వ్యాపారానికి ఉపయోగించిన సెల్ ఫోన్ సీజ్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -