Friday, April 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గంజాయి గస్తీ.. పాన్ షాపుల్లో పోలీసుల తనిఖీలు

గంజాయి గస్తీ.. పాన్ షాపుల్లో పోలీసుల తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్‌లో మాదకద్రవ్యాల నిర్మూలన అరికట్టెందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా శాఖ అధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘గంజాయి గస్తీ’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కుభీర్ లోని పలు పాన్ షాపులను ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామమలో ఉన్న ప్రతి ఒక్క యువత తమ భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి,మరియు  నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పాన్ షాపుల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా గంజాయి, నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, షాపుల లైసెన్స్‌లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా తప్పనిసరిగా ఉంచాలని, ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -