వాహనాల తనిఖీల్లో పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్
నలుగురి అరెస్టు 2.100 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
నవతెలంగాణ – కంఠేశ్వర్
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ కు తరలిపోతున్న ఎండు గంజాయి రవాణా రాకెట్ ను నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో చేదించారు. బుధవారం తెల్లవారు జామున నగర శివారులోని అర్సపల్లి శివారులో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు రూట్ వాచ్ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి వస్తున్న టిఎస్ 33 సి 1393 కారును తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కారులో 2.100 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి రవాణా చేస్తున్న హైద్రాబాద్ లోని బహదూర్ పుర కు చెందిన మహ్మద్ మునావర్, బాలాపూర్ కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్, చాంద్రాయణ గుట్ట కు చెందిన అమీర్ పాషా తో పాటు నిజామాబాద్ నగరంలోని ముజాహిద్ నగర్ కు చెందిన మహ్మద్ అన్వర్ లను అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, కార్ ను, గంజాయి సీజ్ చేశారు. సీజ్ చేసిన కారును గంజాయిని, నలుగురిని విచారణ కోసం ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ నిజామాబాద్ కు అప్పగించారు. ఈ దాడిలో ఎస్ ఐ లు రామ్ కుమార్, చారి తో పాటు సిబ్బంది హమీద్, శివా, రాజన్న, భీమన్న, ఆశన్న, రామ్ బచన్, సాయి ప్రసాద్ పాల్గొన్నారు.
మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు గంజాయి రవాణా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES