– పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టివేత
– రూ.5 కోట్ల విలువైన 935 కిలోల పదార్థం స్వాధీనం
– అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో ఘటన
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. సుమారు రూ.5 కోట్ల విలువైన 935 కిలోల గంజాయిని ఈగల్ టీమ్, పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఓ ముఠా పెద్దఎత్తున గంజాయి అక్రమ రవాణా చేస్తోంది. పక్కా సమాచారం అందుకున్న ఖమ్మం-రాచకొండ నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. బాటసింగారం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. గంజాయి రవాణాకు ఎస్కార్ట్ చేసిన టయోటా ఇన్నోవాను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే టాటా ఐచ్చార్ వాహనాన్ని కూడా తనిఖీ చేసి పండ్ల ట్రేల కింద దాచిన గంజాయిని గుర్తించారు. ముఠా సారధి పవార్‌కుమార్ బాడు, సమాధాన్ భిస్, వినాయక్ పవార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 455 ప్యాకెట్ల గంజాయి, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరాదారులు సచిన్ గంగారాం చౌచౌహాన్, విక్కీ సేథ్ పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
పండ్ల ట్రేల కింద గంజాయి
- Advertisement -
- Advertisement -