నవతెలంగాణ – అశ్వారావుపేట: నిషేదిత గంజాయిని రవాణా చేస్తున్న ఏడుగురు మగ వ్యక్తులను,మూడు మోటారు సైకిళ్ల ను అశ్వారావుపేట పోలీస్ లు గురువారం అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సీఐ పి.నాగరాజు తెలిపిన వివరాలు. ఊట్లపల్లి వైపు నుండి అశ్వారావుపేట వైపుకి వస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు వాహన తనిఖీలు చేస్తుండగా అశ్వారావుపేట పోలీసులు అశ్వారావుపేట – బూర్గంపాడు రోడ్డులోని హెచ్.పి పెట్రోలు బంకు వద్ద పట్టుకుని విచారించడమైనది.వీరి వద్ద నుండి 5.5 కేజీల గంజాయి,06 సెల్ ఫోన్,03 మోటారు సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. నిషేదిత గంజాయి తో పట్టుబడిన ముద్దాయిలు అశ్వారావుపేట కు చెందిన వ్యాపారులు షేక్ ఫిరోజ్ ఖాన్,గండికోట ప్రభు కుమార్,పసుపులేటి.గోపీచంద్ (శ్రీను) వినియోగదారులు అయిన జంగారెడ్డిగూడెం మండలం వేగ వరం కు చెందిన పుట్టా జగదీష్,శావల్యాపురం మండలం,ఇర్లపాడు కు చెందిన ఆవుల.సుధీర్ రెడ్డి,ఉప్పులూరు,కంకిపాడు మండలం కు చెందిన తిరువీధుల కార్తీక్,హైదరాబాద్,చంపాపేట్ కు చెందిన బుల్లా సంజయ్,పెనుమూలి,దుగ్గిరాల మండలం వ్యాపారి,వీరితో పాటు పరారీలో ఉన్న గంజాయి వ్యాపారి అయిన రాము (సప్లయర్ ) మరియు కొంత మంది ( వినియోగదారులు) ఉన్నారని తెలిసింది.వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు నకు తరలించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.హెచ్.ఓ ఎస్సై టి.యయాతి రాజు, హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర రావు, కానిస్టేబుల్స్ హరిబాబు,కృష్ణ ప్రసాద్,పి.రమేష్ రావు,రామకృష్ణ,నరేష్ బాబు,ఎం.భానుచందర్,ఎన్.వెంకటేశ్వరరావు, బి.సంతోష్ లు పాల్గొన్నారు.
రూ.2.75 లక్షల విలువ గల గంజాయి పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES