- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన సోయా బిన్ కొన మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి మార్క్ ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో గాండ్ల సాయిలు, మార్క్ ఫెడ్ ఎక్జిక్యూటివ్ చందు, ఏఈఓ నిఖిత , ఎన్ సీసీఎఫ్ సర్వేయర్లు మహేందర్, సాయి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



