నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో బుధవారం కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి మధులత శ్రీనివాస్ రెడ్డి దంపతులను పంచాయతీ పాలకవర్గం సభ్యులు సత్కరించారు. సర్పంచ్ బెజ్జారపు రాకేష్ ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి మధులత శ్రీనివాస్ రెడ్డి దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించి, ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ భలేరావ్ శంకర్, వార్డు సభ్యులు సామ మనీషా, పిల్లల ప్రియాంక, కరిపే రాజశేఖర్, గట్టు లావణ్య, గాజబోయిన సుకన్య, గడ్డం బుచ్చమ్మ, పోతుగంటి నాగరాణి, చిలుక లత, చెంగల పావని, జక్కుల రూప, మేకల శ్రీనివాస్, దర్శనం మోహన్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ డైరెక్టర్ దంపతులకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



