నవతెలంగాణ-కమ్మర్ పల్లి
భీంగల్ మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బోదిరే నాగమణి స్వామి దంపతులను మండలంలోని కోన సముందర్ గ్రామానికి చెందిన కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి మధులత శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బుధవారం భీంగల్ లోని మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ లో చైర్మన్ బోదిరే నాగమణి స్వామి దంపతులను కలిసి శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి స్వామి దంపతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహుకరించారు.అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జేజే లత నర్సయ్య దంపతులను వైస్ చైర్మన్ దంపతులను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
మున్సిపల్ చైర్మన్ ను సత్కరించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



