Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ చైర్మన్ ను కలిసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్

మున్సిపల్ చైర్మన్ ను కలిసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోన సముందర్ గ్రామానికి చెందిన కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి శ్రీనివాస్ రెడ్డి భీంగల్ మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి స్వామి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మంగళవారం భీంగల్ లోని వారి స్వగృహంలో చైర్మన్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి స్వామి దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ జేజే లత నర్సయ్య దంపతులను వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. వైస్ చైర్మన్ దంపతులను  శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శివ, దినేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -