Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనారోగ్యంతో వివాహిత మృతి 

అనారోగ్యంతో వివాహిత మృతి 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
అనారోగ్యంతో ఓ వివాహిత మృతి చెందిన ఘటన కాన్వాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తాండాల కళ్యాణి- సతీష్ దంపతులకు పదిహేనేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ప్రియవర్షని, దివ్యభాను, దివ్యశ్రీ సంతానం. నిరుపేద కుటుంబానికి చెందిన దంపతులు ఇద్దరు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కళ్యాణి (30) గతకొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. దానికి తోడు ఇటీవల ఆమె జ్వరం రావడంతో సమీపంలోని గ్రామీణ వైద్యడికి చూపించారు. మెరుగైన వైద్యం కోసం తొర్రూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా, చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -