Saturday, May 17, 2025
Homeక్రైమ్విద్యుత్ ఘాతంతో వివాహిత మృతి..

విద్యుత్ ఘాతంతో వివాహిత మృతి..

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : తడి బట్టలు ఐరన్ వైర్ పై ఆరేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై వివాహిత మృతి చెందింది. మృతురాలు వేల్పుల రూప ( 22) భర్త కిషోర్ ఇచ్చిన రాతపూర్వక పిర్యాదు మేరకు ఎస్ఐ.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు కధనం. మండలంలోని వినాయకపురం ఎస్.సీ కాలనీకి చెందిన వేల్పుల రూప (22) శుక్రవారం తడి బట్టలను తన గృహం పందిరి క్రింద ఏర్పాటు చేసిన ఐరన్ వైర్ పై వేసిన క్రమంలో ఆ తీగకు సరఫరా అయిన విద్యుత్ రూప విద్యుత్ ఘాతుకానికి గురైంది.ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది.భర్త కిషోర్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి విచారణ చేపట్టాం అని తెలిపారు. మృతురాలికి ఇద్దరు సంతానం ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -