– కేసు నమోదు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఒకరు మృతి చెందింది. మృతురాలు తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు రాతపూర్వక పిర్యాదు మేరకు ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు కధనం.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కు చెందిన ముదిగొండ వెంకటేశ్వరరావు కూతురు పూల లక్ష్మీ ప్రసన్న కు 10 సంవత్సరాల క్రితం అదే మండలం ఖాన్ ఖాన్ పేట కి చెందిన పూల నరేష్ బాబు తో వివాహం జరిగింది. ప్రస్తుతం వారికి మూడు సంవత్సరాల పాప ఉంది.వారి వివాహ సంబంధం గొడవల కారణంగా మూడు సంవత్సరాల క్రితం వారి స్వగ్రామం నుండి అశ్వారావుపేట కి వచ్చి నరేష్ బాబు సోదరి దాసరి విజయలక్ష్మి ఇంట్లోనే నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 23 వ తేదీ శనివారం లక్ష్మి ప్రసన్న ఇంట్లో పనిచేస్తుండగా జారిపడి నుదుటికి,గవద కు రక్తపు గాయాలయ్యాయని, వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ కి తరలిస్తున్నాను అని నరేష్ బాబు లక్ష్మిప్రసన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.కబురు అందిన వెంటనే తల్లిదండ్రులు రాజమండ్రి లోని కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి చూడగా తన కూతురు వెంటిలేటర్ పై ఉండి,శారీరకంగా కుంచించుకుపోయి,ఒంటి పై మానిన గాయాలు గమనించారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఏడు గంటల 50 నిమిషాల సమయంలో మృతి చెందింది.
మృతురాలు లక్ష్మి ప్రసన్న(33) తండ్రి ముదిగొండ్ల వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త నరేష్ బాబు,అతని బంధువులు మరో ఇరువురి పై అనుమానం కలదని ఫిర్యాదు ఇవ్వగా అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.