- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని హంగర్గా గ్రామానికి చెందిన మహిళ మిస్సింగ్ అయ్యారని వారి కుటుంబీకులు జుక్కల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నవీన్ చంద్ర మాట్లాడుతూ.. సోమవారం (మార్చి-30) 2026న మధ్యాహ్నం హంగర్గా గ్రామానికి చెందిన వివాహిత వాగ్మారే చంద్రకళ (21) తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయిందని తెలిపారు. దీంతో ఆమె తలిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారని చెప్పారు. చంద్రకళకు గత 9 నెలల క్రితమ వివాహం జరిగినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై అన్నారు.
- Advertisement -



