Saturday, November 1, 2025
E-PAPER
Homeసినిమాథియేటర్లలో 'మాస్‌ జాతర'

థియేటర్లలో ‘మాస్‌ జాతర’

- Advertisement -

రవితేజ నటించిన ‘మాస్‌ జాతర’ శుక్రవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్‌ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నేటి నుంచి థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇందులో రైల్వే పోలీస్‌ అధికారిగా రవితేజ నటించారు. ఇటీవల రిలీజైన ట్రైలర్‌ భారీ యాక్షన్‌ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్‌ డైలాగ్‌లతో రవితేజ అభిమానులు కోరుకునే మాస్‌ విందులా అందర్నీ ఎట్రాక్ట్‌ చేసింది. ముఖ్యంగా నాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్‌ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రానికి హామీ ఇచ్చేలా ‘మాస్‌ జతర’ ట్రైలర్‌ ఉంది. నవీన్‌ చంద్ర మరోసారి శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో మెరిసి, రవితేజను ఢీకొట్టే పాత్రలో మెప్పించారు. సినిమా సైతం అందర్నీ మెప్పిస్తుందని మేకర్స్‌ తెలిపారు. రచయిత, దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -