Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ బందుకు మాస్ లైన్ మద్దతు..

బీసీ బందుకు మాస్ లైన్ మద్దతు..

- Advertisement -

కొత్తపల్లి శివకుమార్, సిపిఐ (ఎం.ఎల్ ) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

ఈనెల 18న జరిగే బీసీ బందుకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.బీసీ రిజర్వేషన్ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ, శాసనసభలో చేసిన తీర్మానాన్ని, గవర్నర్ ఆమోదించకుండా ఉండటం, కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చకపోవడం విచారకర విషయం అన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో టిఆర్ఎస్ ,బిజెపి లు కపట నీతి ని ప్రదర్శిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

బీసీ బిల్లును అడ్డుకుంటామని బిజెపి ఎంపీ బండి సంజయ్ బహిరంగంగా మాట్లాడుతున్నారని, బీసీ బిల్లును అడ్డుకొనే బిజెపిని రాష్ట్రంలో అడ్రస్ లేకుండా చేయాలని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్ బీసీలకు న్యాయబద్ధమైనదని, దానిని అమలు చేయించుకునే క్రమంలో బీసీ సంఘాలకు సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు. 18న జరిగే బీసీ బందులో పార్టీ సభ్యులందరూ క్రియాశీలకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కార్మికుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు అఖిల్ కుమార్, ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకులు పేర్ల నాగన్న టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నరసన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -