- Advertisement -
- – సర్వం కోల్పోయిన బాధితులకు 10 లక్షలు ప్రక ప్రకటించాలని డిమాండ్…
– ఏ ఐ యు కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్...
నవతెలంగాణ – రెంజల్ - గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగి రెంజల్ మండలంలోని కందకుర్తి, పేపర్ మిల్, నీలా, బోర్గం, తాడు బిలోలి గ్రామాలలో ని వేలాది ఎకరాల సోయా, వరి పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరిగింద ని ఏయు కె ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని ముంపు గ్రామాలను ఆయన క్షేత్రస్థాయిలో వెళ్లి తన బృందంతో పరిశీలన జరిపారు. మండలంలో సుమారు 8వేల ఎకరాలలో సోయాబరీ పంటలు రైతుల చేతికి రాకుండా మురిగి పోయాయని ఆయన పేర్కొన్నారు. సోయకు ఎకరానికి 70 వేలు, వరి పంటకు 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- వరదలు సర్వం కోల్పోయిన కుటుంబాలను గుర్తించి వారికి పది లక్షల రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మండలంలోని తాడు బిలోలి, కందకుర్తి, గ్రామాలలో ని పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఐ పికే ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి దేవరాం, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుట్టి నడిపి నాగన్న, జిల్లా అధ్యక్షులు సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్, జిల్లా నాయకులు రమేష్, పార్వతి రాజేశ్వర్, జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, ఉపాధ్యక్షులు వడ్డన్న, మాజీ సర్పంచ్ కొజ్జా రమేష్, రైతు నాయకులు బాజీరావు, పాశం రమేష్, సుల్తాన్, సాయి లు, గోపాల్, సిద్ధ పోశెట్, జబ్బార్, గొల్ల సాయిలు, మన్నె పోశెట్టి, తరుణ్, లక్ష్మణ్, ఇస్మాయిల్, రాములు అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -