Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం 

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దవంగర ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో సామూహిక అక్షరాభ్యాసం గురువారం వైభవంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి మల్లికార్జున చారి, ఏసీడీపీవో విజయ లక్ష్మి లు కలిసి పిల్లల చేత అక్షరాలు దిద్దించారు. అనంతరం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించి, కిశోర బాలికలకు, తల్లులకు గర్భిణీ స్త్రీలకు పోషక ఆహారంపై ప్రాముఖ్యతను వివరించారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జెడ్సీ చిదిరాల నవీన్, ఆర్సీ దామెర సరేష్, ఎడవల్లి మధుసూదన్ రెడ్డి, ముత్తినేని శ్రీనివాస్, కేసరబోయిన సుభాష్ , జలగం సతీష్, అంగన్వాడీ సూపర్వైజర్స్ శోభా, శ్రీదేవి, సునీత, టీచర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -