నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని మహ్మదాబాద్ గ్రామంలో కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో 200 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. హన్మంత్ షిండే నాయకత్వంపై విశ్వాసం ఉంచి, అభివృద్ధి మార్గంలో భాగస్వామ్యం అవ్వాలని సంకల్పంతో స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే మాట్లాడుతూ.. గత పదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను చూసి ప్రజలు మా పార్టీవైపు ఆకర్షితులౌతున్నారని అన్నారు.
అభివృద్ధి కోసం పనిచేసే నాయకత్వమే ప్రజలకు కావాలన్నారు. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుతున్నామని తెలిపారు. ఈ చేరికల సందర్భంగా గ్రామంలో సందడి నెలకొంది. నూతనంగా చేరిన కార్యకర్తలు షిండేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “జుక్కల్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ గెలవాలి, ముందుకు సాగాలి” అనే నినాదాలతో కార్యకర్తలు మార్మోగించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్షెట్టి సాయిలు, లక్సెట్టి రామన్న , జాదవ్ రాజు, గ్రామస్థాయి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



