నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు చెందిన 48 మంది కార్యకర్తలు సోమవారం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, జిల్లా నాయకులు లింగారెడ్డి, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు సిద్ధ రాములు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్మయ్య, వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ భూమయ్య, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ నర్సింలు, నాయకులు రాజయ్య, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో భారీగా చేరికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES