ఆరుగురు సజీవదహనం
ఛత్తీస్‌గఢ్ బొగ్గు కొలిమిలో ఘటన
రాయ్ పూర్ : ఛత్తీస్‌గఢ్ బలోదాబజార్‌లోని స్టీల్‌ప్లాంట్ బొగ్గు కొలిమిలో గురువారం అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బలోదాబజార్ జిల్లా కలెక్టర్ దీపక్ సోని మాట్లాడుతూ.. ‘ఈ ప్రమాదంలో క్షతగాత్రుల్ని చికిత్స కోసం బిలాస్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించాం. బట్టి లోపల
బొగ్గును కాల్చి తిప్పుతున్నప్పుడు ఈ పేలుడు సంభవించింది. దీనివలన స్టీల్‌ప్లాంట్‌కి తీవ్రనష్టం వాట్లింది. పలువురు కార్మికులు చనిపోయారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రెస్యూ ఆపరేషన్స్ చేపట్టడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు దారితీసిన పరిస్థితులను అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు’ అని అన్నారు.



