Thursday, January 15, 2026
E-PAPER
Homeక్రైమ్అల్వాల్‌లో భారీ అగ్నిప్రమాదం

అల్వాల్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

– కార్ల షోరూంలో చెలరేగిన మంటలు..
– లక్షల్లో ఆస్తి నష్టం..!
నవతెలంగాణ-అల్వాల్‌

హైదరాబాద్‌ అల్వాల్‌లోని ట్రూ వాల్యూ సెకండ్‌ హ్యాండ్‌ కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లి నట్టు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం షోరూం తెరిచిన కొద్దిసేపటికే లోపల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షోరూం లోపల ఫర్నీచర్‌, ఇతర పదార్థాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అక్కడే ఉన్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. షోరూంలో కార్లకు మంటలు అంటుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న అల్వాల్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పరిసర ప్రాంతాలు దట్టమైన నల్లటి పొగతో కమ్మేయడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

షార్ట్‌ సర్క్యూటే కారణమా..
విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. దాదాపు 4 నుంచి 5 కార్లు పూర్తిగా కాలిపోయినట్టు సమాచారం. ఆస్తి నష్టం విలువ లక్షల్లో ఉండొచ్చని యాజమాన్యం అంచనా వేస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అనే కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -