Sunday, December 21, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం

- Advertisement -

అన్నాచెల్లెలు సహా నలుగురి సజీవదహనం
ఒక మహిళ సహా ఇద్దరికి గాయాలు
ఘటనపై కేసు నమోదు..
దర్యాప్తు ప్రారంభం : పోలీసులు

ఢిల్లీ : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని టిగ్రి ఎక్స్‌ టెన్షన్లోని చెప్పుల దుకాణంలో జరిగిన ఈ ఘటనలో అన్నా, చెల్లెలు సహా నలుగురు సజీవదహనమయ్యారు. ఒక మహిళ సహా ఇద్దరు గాయపడ్డారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని తెలిపారు. వివరాళ్లోకెళ్తే… నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగినట్టు సాయంత్రం 6.24 గంటలకు పీసీఆర్‌ కాల్‌ వచ్చింది. దీంతో వెంటనే తమతో పాటు అగ్నిమాపక సిబ్బందిని తీసుకుని పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే భవనం మొత్తం మంటలు వ్యాపించాయి.

దీంతో మంటలను అదుపుచేసేందుకు సుమారు 5 గంటల సమయం పట్టింది. ప్రమాదంలో మరణించినవారిలో భవన యజమాని జిమ్మీ, ఆయన సోదరి అనితగా గుర్తించామని అధికారులు చెప్పారు. మరో ఇద్దరు మృతులను గుర్తించాల్సి ఉందన్నారు. ఇక గాయపడినవారిలో ఒకరిని మమత (40)గా గుర్తించారు. 25 శాతం కాలిన గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -