నవతెలంగాణ-హైదరాబాద్ : ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాకిస్తాన్ దేశంపై భారీ వరదలు విరుచుకుపడ్డాయి. జూన్ 26 నుంచి జూలై 6 వరకు భారీగా మాన్సూన్ వర్షాలు కురవడంతో వచ్చిన ఆకస్మిక వరదలు .. తూర్పు పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, సింధ్‌లతో సహా దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) స్థానిక అధికారుల ప్రకారం..ఈ వరదల్లో కనీసం 72 మంది మరణించగా, 130 మందికి పైగా గాయాలు అయ్యాయి. అందులో 28 మంది పిల్లలు, 17 మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. గాయాలైన వారిలో 39 మంది పిల్లలు, 33 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. మెరుపు వేగంతో వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా.. దేశవ్యాప్తంగా వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలో 15,000 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. అలాగే వ్యవసాయ భూములు, పంటలు, రోడ్లు, వంతెనలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంజాబ్‌లోని సుత్లేజ్ నది అత్యధిక స్థాయిలో ప్రవహించడంతో లక్ష మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారీ వరదలు.. 72 మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES