సామాజిక ప్రజావేదికలో వెలుగులోకి
రూ.65,342 రికవరికి ఆదేశాలు.
నవ తెలంగాణ-మల్హర్ రావు.
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా గురువారం మండల పరిషత్ కార్యాలయంలో 16వ విడత సామాజిక ప్రజావేదిక కార్యక్రమాన్నీ ఎంపిడిఓ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా డిఆర్డీఓ బాలకృష్ణ, ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని 15 గ్రామపచాయితీల్లో 1-4-2024 నుంచి 31-3-2025 ఆర్థిక సంవత్సరంలో రూ.4,07,38,522 కోట్ల 177 వివిధ రకాల పనులు చేపట్టారు.అయితే సోషల్ ఆడిట్ బృదం వారం రోజుల పాటు సామాజిక తనిఖీలు చేపట్టి గురువారం 16వ విడత సామాజిక ప్రజావేదికలో అన్ని గ్రామాల నివేదికలు చదివి వినిపించారు.ఈ తనిఖీల్లో ఎక్కువగా పిల్డ్ అసిస్టెంట్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బినామీ పేర్లతో పనులు చేయించడం,ఒక్కరి పేరుమీద ఒక్కరు పనులు చేయడం,నాటిన మొక్కల్లో లెక్కలు కనీసం 40 శాతం మోకాపై లేకుండా లెక్కల్లో అవకతవకలు, పనులపై సంబంధించిన ఈజిఎస్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం తదితర అవకతవకలపై డిఆర్డీఓ రూ.65,242 వేలు రికవరికి ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,డివిఓ రూబినా, క్యూసి దరంసింగ్,అంబున్స్ మెన్ శ్రీనివాస్,ఎపిఓ హరీష్,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,ఈజిఏస్ సిబ్బంది పాల్గొన్నారు.
పిల్డ్ అసిస్టెంట్ కుటుంబ సభ్యులపై కూలి చెల్లింపులు..
బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన16వ విడత సామాజిక ప్రజావేదికలో సోషల్ ఆడిట్ అధికారులు ప్రవేశపెట్టిన నివేదికలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి.తాడిచెర్ల పిల్డ్ అసిస్టెంట్ మెడగాని రాజయ్య కొడుకు,కోడలు పనులకు వెళ్లకున్న ఒక్కొక్కరికి రూ.8,500,రూ.581 కూలి చెల్లింపులు జరిగినట్లుగా సోషల్ ఆడిట్ బృందం సామాజిక ప్రజావేధికలో బహిర్గతం చేశారు.ఇవే కాకుండా నాటిన మొక్కల్లో తప్పుడు లెక్కలు,బినామీ పేర్లపై పనులు తదితరుల భారీ అవకతవకలు జరిగాయి.ఈ అక్రమాలపై సంబంధించిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా.?.కంటి తుడుపు చర్యగా చేతులు దులుపుకుంటారో.? వేచి చూడాలసిందే