కలుషితమవుతున్న తాగునీరు
పట్టించుకోని యంత్రాంగం
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లక్షలు ఖర్చు చేసి మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు ఇంటింటా పరిశుద్ధమైన తాగునీరు అందించడానికి చేస్తున్న కృషి సంబంధించిన మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యంగా అడుగడుగునా లికేజీలతో ప్రజలు ట్యాగునీటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందుకు సాక్షాత్తు నిదర్శమే మండలంలో మల్లారం పారెస్ట్ బిట్ పరిధిలోని గుట్టపై ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంకర్ నుంచి అరేవాగు బ్రిడ్జి వరకు లీకేజీల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. మల్లారం వేంకటేశ్వర రా రైస్ మిల్లు ముందు మిషన్ భగీరథ పైప్ లైన్ కొద్దీ రోజులుగా నీరు లికెజై శుక్రవారం భారీగా లికెజై నీరు పొలాల్లోకి వెళుతుంది.
పొలాల్లో ఉన్న మురికి నీరు పైప్ లైన్ లోకి చేరడంతో తాగునీరు కల్తీమయంగా మారుతోంది.ఈ లీకేజీ కొద్దీ రోజులుగా జరుగుతున్న సంబంధించిన అధికారులకు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.అసలే వేసవికాలం కావడంతో తాడిచెర్ల, మల్లారం,చిన్నతూoడ్ల,దబ్బగట్టు గ్రామాల ప్రజలు తాగునీటి ఇబ్బందులకు గురైయ్యే అవకాశాలు ఉన్నాయి కావున లికేజీలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.లీకేజీ పరిస్థితిపై మండల ఇంట్ర ఏఈ శ్రీకాంత్ ను నవ తెలంగాణ వివరణ కోరగా కొద్దీ గంటల్లోనే లీకేజీకి మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.



