Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు ..

గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు ..

- Advertisement -

కోనమ్మకుంటను సందర్శించి పరిశీలించిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ 
నవతెలంగాణ – పాలకుర్తి

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం జరిగే గణేష్ నిమజ్జనానికి ఉత్సాహ కమిటీ సభ్యులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ సూచించారు. గురువారం పాలకుర్తి శివారు పెద్దమ్మ గుడి సమీపంలో గల కోనమ్మకుంటను పాలకుర్తి సీఐ జానకిరామ్ రెడ్డి తో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా పోటీ పడరాదని, ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.

గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి సహసం చేయరాదని, చిన్నపిల్లలు నిమజ్జనంలో కుంట లోపలికి వెళ్లేందుకు పాల్గొనకూడదని సూచించారు. కోనమ్మకుంట వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, కోనమ్మకుంట పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. నిమజ్జనానికి కుంటలోకి నలుగురు మాత్రమే వెళ్లాలని సూచించారు. మద్యం సేవించి నిమజ్జనం చేసేందుకు వెళ్లకూడదని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దూలం పవన్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad