నవతెలంగాణ-మణుగూరు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త బంద్ మణుగూరులో సంపూర్ణంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్త బందుకు సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్, కాంగ్రెస్, బిఆర్ఎస్, తెలుగుదేశం, బిజెపి పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపి ప్రత్యక్షంగా పాల్గొన్నాయి ఉదయం 3 గంటల నుండి ఆర్టిసి డిపో ముందు బస్సు కదలకుండా అఖిలపక్ష పార్టీలు బీసీ సంఘాల జేఎస్ నాయకులు అడ్డుకున్నారు దుకాణ సముదాయాలు, హోటల్స్ పెట్రోల్ బంకులు తెరవలేదు ప్రభుత్వం, ప్రవేట్ పాఠశాలాలు బంధు సంపూర్ణంగా నిర్వహించాయి కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలో మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించాయి. అనంతరం పట్టణంలో బీసీ సంఘాల జేఏసీ వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ లో మానవహారం నిర్వహించారు. మణుగూరు సబ్ డివిజన్ డిఎస్ పి బి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇన్చార్జి సీఐ వెంకటేశ్వర్లు బందోబస్తు నిర్వహించారు.