Saturday, March 28, 2026
E-PAPER
Homeజాతీయంపెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ భారీగా తగ్గింపు

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ భారీగా తగ్గింపు

- Advertisement -

అయినా ధరల తగ్గుదల అవకాశాలు తక్కువే
వినియోగదారుడికి చేకూరని ప్రయోజనం!
చమురు కంపెనీల నష్టాలను పూడ్చేందుకు మోడీ సర్కారు నిర్ణయం : విశ్లేషకులు


న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాలను భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 తగ్గించగా.. డీజిల్‌పై పూర్తిగా (జీరో) రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు పెట్రోల్‌పై లీటర్‌కు రూ.13, డీజిల్‌పై రూ.10 వరకు ఎక్సైజ్‌ సుంకం కేంద్రం వసూలు చేస్తోంది. అయితే సుంకాలు భారీగా తగ్గించడంతో ధరలు తగ్గుతాయనే ఆశలో సాధారణ ప్రజలు ఉన్నారు. కానీ అలాంటి అవకాశాలు చాలా తక్కువేనని విశ్లేషకులు చెప్తున్నారు.

చమురు కంపెనీల కోసమే..!
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించినప్పటికీ వినియోగదారులకు వెంటనే ఉపశమనం లభించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా హార్ముజ్‌ జలసంధి దాదాపు మూతబడటంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో నష్టాల్లో ఉన్న చమురు కంపెనీల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజీల్‌లపై సుంకాలను తగ్గించిందనే వాదనను విశ్లేషకులు వినిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీని.. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తమ నష్టాన్ని తగ్గించుకోవడానికి వినియోగించే అవకాశం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు లబ్ది చేకూరడం కష్టమేనని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -