Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరాష్ట్రంలో భారీగా రహదారుల నిర్మాణం

రాష్ట్రంలో భారీగా రహదారుల నిర్మాణం

- Advertisement -
  • వారసత్వంగా రూ.45 వేల కోట్ల బకాయిలు : ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
    నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

    రాష్ట్రంలో హ్యామ్‌ ప్రాజెక్టు కింద భారీగా రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ప్రభుత్వం అభివద్ధి పనుల బకాయిల పేర రూ.45,000 కోట్లను వారసత్వంగా ఇచ్చి వెళ్ళిందని విమర్శించారు. తెలంగాణ రైజింగ్‌లో కాంట్రాక్టర్లు భాగస్వాములు కావాలనీ, హ్యామ్‌ రోడ్డు పనుల్లో చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో మంగళవారం హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ రోడ్‌ షోకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులు నాగరికతకు చిహ్నాలు, రహదారులు అభివద్ధి జరిగితే మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కడికైనా ఉత్పత్తైన వస్తువులను సులువుగా తరలించవచ్చని అన్నారు. రహదారుల నిర్మాణంతో పరిశ్రమలు పెరిగి తద్వారా మన రాష్ట్ర యువతకు ఉపాధి, ఆదాయం సమకూరుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదు తెలంగాణ రైజింగ్‌లో భాగంగా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలను ముందుకు తీసుకు వెళుతుందని తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 17 ప్యాకేజీల ద్వారా 7,947 కిలోమీటర్లు, రోడ్లు భవనాల శాఖ పరిధిలో 17 ప్యాకేజీల ద్వారా 5,190 మేరకు రోడ్లు అభివద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. క్యాబినెట్‌ ఆమోదించిన రోడ్డు పనులకు త్వరితగతిన టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలనీ, కాంట్రాక్టర్లకు ఆర్థికంగా ప్రోత్సాహం కల్పించేందుకు బ్యాంకర్లతోనూ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు దష్టి పెట్టి పని చేయడంతో క్రమంగా ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ల ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తుందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు.

    అద్దంలాంటి రోడ్లు:కోమటిరెడ్డి
    ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అద్దం లాంటి రోడ్లు నిర్మించనున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ రోడ్‌ షోకు వచ్చిన డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌ భట్టి విక్రమార్క, సహచర మంత్రివర్యులు సీతక్కకు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే కాంగ్రెస్‌ ప్రజాప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. అందులో భాగంగానే, హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌లో రహదారుల నిర్మాణానికి పూనుకున్నామన్నారు. ప్రజలను రహదారులతో అనుసంధానించడం, రాష్ట్ర అభివద్ధిని ప్రోత్సహించడం, తెలంగాణ భవిష్యత్తుకు రూపకల్పన చేయడం అనే ఆశయంతో అవిశ్రాంతంగా కషి చేస్తున్నామన్నారు. తెలంగాణ, దేశంలోనే అత్యంత వేగంగా అభివద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటనీ, గత పదేండ్లలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మాత్రం ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉందన్నారు.

    రాష్ట్ర ఆర్థిక పురోగతి ఎంత ముఖ్యమో, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం అంతే ముఖ్యమని వ్యాఖ్యానించారు. హ్యమ్‌ మొదటి దశలో పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం 17 ప్యాకేజీలలో 7,947 కిలోమీటర్ల రోడ్డు పనులను చేపడుతుందన్నారు. రోడ్లు, భవనాల శాఖ అభివద్ధి చేయాలని తలపెట్టిన 12 వేల కిలోమీటర్ల రహదారుల్లో మొదటి దశలో 6478.33 కోట్ల రూపాయలతో 17 ప్యాకేజీలలో 5,190 కిలోమీటర్ల రోడ్లను అభివద్ధి చేస్తుందన్నారు. మిగిలిన 6810 కిలోమీటర్ల రహదారులను వచ్చే డిసెంబర్‌ నాటికి టెండర్లు పిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img