Tuesday, April 29, 2025
Homeజాతీయంరాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

నవతెలంగాణ – అమరావతి: నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లాలోని గుత్తి వద్ద ఈ తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు. అప్పటికే అక్కడ మాటువేసిన ఐదుగురు దుండగులు రైలులోకి చొరబడ్డారు. మొత్తం పది బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల బంగారం, నగదుతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img