- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో డెడ్‌లైన్ చివరి రోజున 34 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో ఆయుధాలను అప్పగించిన వీరి వద్ద నుంచి ఏడు కిలోల బంగారం, మూడు కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మావోయిస్టుల కార్యకలాపాలకు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.
- Advertisement -



