అల్మారా పగలగొట్టి రూ.1.70కోట్లు అపహరణ
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
ఇంజినీరింగ్ కాలేజీలో అల్మారా పగలగొట్టి కోటీ డెబ్బై లక్షల రూపాయలు దొంగిలించిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో కళాశాల ప్రిన్సిపాల్ ఉలిగడ్ల వీరన్న గురువారం సాయంత్రం ఆరు గంటలకు విధులు ముగించుకొని కాలేజీ గేట్, ఆఫీస్ రూమ్‌కు తాళాలు వేసి వెళ్లారు. శుక్రవారం ఉదయం 8:45 గంటలకు కళాశాల ఏఓ కేశినేని కుమార్ కళాశాలకు వెళ్లగా కాలేజ్ గేట్, రూమ్, అల్మారా తాళాలు పగులగొట్టి ఉన్నట్టు ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో ప్రిన్సిపాల్ అక్కడికి చేరుకొని పరిశీలించగా రూ.1.70కోట్లు మాయమైనట్టు గుర్తించారు. అవి విద్యార్థుల ఫీజులకు సంబంధించిన డబ్బులని తెలిపారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు సంచరించినట్టు గుర్తించారు. ఘటనా స్థలాన్ని సీపీ సుధీర్ బాబు, డీసీపీ అనురాధతో పాటు ఆఫీషనల్ డీసీపీ కోటేశ్వరరావు, క్రైమ్ డీసీపీ అరవింద్, సీఐ అశోక్ రెడ్ది ఎస్‌ఐలు తదితరులు పరిశీలించారు.
ఇంజినీరింగ్ కాలేజీలో భారీ చోరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES