Monday, April 28, 2025
Navatelangana
Homeట్రెండింగ్ న్యూస్ఇండిస్టీ, ఇన్వెస్ట్‌మెంట్‌ సీఈవోగా జయేశ్‌ రంజన్‌

ఇండిస్టీ, ఇన్వెస్ట్‌మెంట్‌ సీఈవోగా జయేశ్‌ రంజన్‌

- Advertisement -

– భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
– ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న డాక్టర శశాంక్‌ గోయల్‌ను గుడ్‌ గవర్నెన్స్‌ వైఎస్‌ చైర్మెన్‌గా బదిలీ చేశారు. ఇప్పటి వరకు పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేశ్‌ రంజన్‌ ఇండిస్టీ, ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ సీఈవోగా నియమితులయ్యారు. పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సంజరు కుమార్‌, ఫైనాన్స్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా స్మితాసభర్వాల్‌, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిశోర్‌, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఎండీఏ వెలుపల)గా టీకే శ్రీదేవి, పట్టణాభివద్ధిశాఖ కార్యదర్శి( హెచ్‌ఎండీఏ పరిధి)గా ఇలంబర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌, ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌గా కె.శశాంక, జెన్‌కో సీఎండీగా ఎస్‌.హరీశ్‌,రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ సెక్రటరీ, సీఈవోగా నిఖిల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సంగీత సత్యనారాయణ,దేవాదాయశాఖ డైరెక్టర్‌గా ఎస్‌. వెంకటరావు నియమితులయ్యారు.
స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ జేఎండీగా ఉన్న పి.కాత్యాయనీ దేవిని సెర్ప్‌ అడిషనల్‌ సీఈవోగా బదిలీ చేశారు. పాఠశాల విద్య సంచాలకులుగా ఉన్న ఈ.వీ.నర్సింహారెడ్డిని పరిశ్రమలు, పెట్టుబడుల సెల్‌ అదనపు సీఈవోగా, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీగా ఉన్న భోర్కాడే హేమంత్‌ సహదేవరావును జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌గా, హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌ జి.ఫణీంద్ర రెడ్డిని టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీగా బదిలీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) విధులు నిర్వహిస్తున్న పి.కధిరవణ్‌ను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒఎస్డీగా ఉన్న కె.విద్యాసాగర్‌ (నాన్‌ కేడర్‌)ను హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేశారు. ఆర్‌. ఉపేందర్‌ రెడ్డి (నాన్‌ కేడర్‌) హెచ్‌ఎండీఏ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
అదనపు బాధ్యతలు
పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ కాగా వారికి అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌కు ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా, జయేశ్‌ రంజన్‌కు ఆర్కియాలజీ డైరెక్టర్‌గా, ఎం.దానకిశోర్‌కు ఉపాధి, శిక్షణ డైరెక్టర్‌, ఐఎంఎస్‌ డైరెక్టర్‌, లేబర్‌ కమిషనర్‌ గా, టి.కె.శ్రీదేవికి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ (ఒఆర్‌ఆర్‌ పరిధి బయట), కె.శశాంకకు మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టర్‌గా, ఎస్‌.హరీశ్‌కు సమాచార, పౌరసంబంధాల స్పెషల్‌ కమిషనర్‌గా, రెవెన్యూ డిపార్ట్‌ మెంట్‌ జాయింట్‌ సెక్రెటరీ, ఎస్‌.సంగీత సత్యనారాయణకు ఆరోగ్య హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా, ఎస్‌.వెంకటరావుకు యాదగిరిగుట్ట దేవాలయం ఈవోగా, ఇ.వి.నర్సింహారెడ్డికి ఎంఆర్‌ డీసీఎల్‌ ఎండీగా, కె.విద్యాసాగర్‌కు హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు