హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెట్రో పాలిటన్ ఏరియా ప్రత్యేక సీఎస్‌గా జయేశ్ రంజన్‌ను నియమించింది. పర్యాటక శాఖ ప్రత్యేక సీఎస్‌గానూ కొనసాగుతారు. సిరిసిల్ల కలెక్టర్‌గా ఉన్న హరితను టీజీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా హేమంత్ సహదేవ్‌రావ్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా సందీప్ సుల్తానియా, చార్మినార్ జోనల్ కమిషనర్‌గా ఎస్. శ్రీనివాస్‌రెడ్డి, గోల్కొండ జోనల్ కమిషనర్‌గా జి.ముకుంద్‌రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా ప్రియాంక, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌గా ఎన్. రవి కిరణ్, శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా కె.చంద్రకళ, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్‌గా హేమంత్ కేశవ్ పాటిల్, మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్‌గా సంచిత్ గంగ్వార్, ఉప్పల్ జోనల్ కమిషనర్‌గా రాధికా గుప్తాను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ సిరిసిల్ల కలెక్టర్‌గా గరిమా అగర్వాల్ కొనసాగుతారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఇ.వి. నర్సింహారెడ్డిని ప్రభుత్వం నియమించింది.
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



