- Advertisement -
- ఉద్యోగ విరమణ సందర్బంగా ఘన సన్మానం
నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని చలకుర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులగా పనిచేస్తున్న బాలాజీ మాస్టారు ఈనెల 30 పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్బంగా బాలాజీ మాస్టారుకు చలకుర్తి ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో జరిగిన అభినందన సభలో మండల విద్యాధి కారి తరిరాము హాజరై సరస్వతి దేవికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన అభినందన సభలో బాలాజీ -రేణుక దంపతులను శాలువా, పూలమాలలత ఘనంగా వివిధ ఉపాధ్యాయ సంఘాలు నాయకులు బాలాజీ మాస్టారు -రేణుక దంపతులను శాలువా, ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్బంగా పలువురు వక్తలు, ఎంఈఓ మాట్లాడుతూ .. 36 ఏళ్ళు గా బాలాజీ మాస్టారు ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి పాఠశాల అభివృద్ధికి బాటలు వేశారని వక్తలు కొని యాడారు. - ఒక వైపు ఉపాధ్యాయ వృత్తి లో వుంటూ మరో పక్క సేవాకార్యక్రమాలు చేపట్టి పాఠశాల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజమని, విధి నిర్వహణలో చేసిన మంచి పనులు చిరస్థాయిగా ఉంటాయని అన్నారు.క్రమశిక్షణకు కట్టుబడి, సమయపాలన పాటించి, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యార్థులను శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేసి పాఠశాల అభివృద్ధి కి ఎంతో తోడ్పాటు అందించారని అన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో తిరుమల గిరి సాగర్ మండల విద్యాధికారీ శ్రీనివాస్,మండల నోడల్ అధికారి శేషు ప్రసాద్,చలకుర్తి కాంప్లెక్స్ గెజిటెడ్ ఉపాధ్యాయులు, ఝాన్సీలక్ష్మి,సుదర్శన్, పిఆర్టీయు మండలం అధ్యక్షులు ఇరుమాది పాపిరెడ్డి, యూటీఎఫ్మండల అధ్యక్ష,కార్యదర్శులు రమావత్ కృష్ణ,గోళీ కృష్ణ,పిఆర్టీ యు మాజీ మండల అధ్యక్షులు దండ వీరారెడ్డి,వెంకట్రామ్ నాయక్,సైదా నాయక్,కుందూరు జానారెడ్డి,కుంభ పార్వతి,ఉపాధ్యాయులు,విద్యార్థులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -