ఇవీ..
శకుని పాచికలు..!
చెట్టుచాటు నుండి విడిచే
అసమర్థుడి బాణం!
నాటి నాగరికతలో మంత్రం,
నేటి ప్రజాస్వామ్యంలో యంత్రం..
అదే దొంగచరిత్ర !
ఓటు ఆయుధమని నేర్పిన దేశం,
నీ ఆయుధంతో నీ నడ్డినే
పొడిచే కుట్ర!
దొంగచేతికి తాళం
ఒక దగ్గర గెలిచినట్టు
మరో దగ్గర ఓడినట్టు..
అబ్రకదబ్ర గారడీ,
ప్రజలకొడుతున్నారు బురిడీ!
ఓట్ చోరి ఓట్ చోరి
కేకలు వేసిన స్వరం
మైక్‌లోనే మగ్గిపోయింది.
అల తాతల నాటి
సత్యాగ్రహ స్ఫూర్తి తగ్గిపోయింది.
అది పాత కథ
మాయల ఫకీరు ప్రాణం చిలకలో లేదు
పోలింగ్ బూత్ యంత్రంలో ఉంది%ౌ
చీకటి యంత్రాంగంలో ఉంది!
ప్రజలకేమీ పట్టనట్టు,
పార్టీలు సంపదకై పుట్టినట్టు,
నాయకులు మతి భ్రమించినట్టు
సెల్ఫీ యుగపు
సెల్ఫ్‌లెస్ ఫెలోస్!
కవులు అందమైన కవిత్వానికై
అర్రులు చాస్తూ,
అత్యవసర కవిత్వం
అనవసరం అంటున్నారు!
మేధాతనం
పుష్టిగా మేసి
సుస్తుగా మూలుగుతుంది!
మీడియాలు మోడి’ఫై అవుతూ%ౌ
కనికట్టు ఎన్నికలపై
పడికట్టు విశ్లేషణలు చేస్తుంటాయి!
మీట నొక్కినంతకాలం
పీక నొక్కడం కాయం!
ఇదొక అబద్ధపు క్రీడ
గెలుపు, ఓటములు పచ్చిమాయ!
యంత్రస్వామ్య నాటకం,
ప్రజాస్వామ్యం బూటకం!
ఎన్నికల యంత్రం నశించాలి,
ప్రజాతంత్రం వర్ధిల్లాలిబీ
భారతదేశం గెలిచి నిలవాలి!
జయహౌ భారత్!!
- మామిడి అమరేందర్



