Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోనాపూర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం

కోనాపూర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన 150 గణిత బోధనోపకరణాలను ప్రదర్శించారు. క్షేత్రగణితం, రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితి, బీజ గణితం అధ్యాయాలకు సంబంధించిన 6 నుండి 10 తరగతులు గణిత బోధనకు ఉపయోగపడే  అభ్యసన సామాగ్రి ప్రదర్శించారు.ఎస్ సిఈఆర్ టి సరఫరా చేసిన గణిత కిట్, పేపర్ ఫోల్డింగ్ ద్వారా రేఖా గణిత ఆకారాలు, నిత్యజీవితంలో పరిసరాలలో లభించే సామాగ్రితో విద్యార్థులు ఉపకరణాలు తయారు చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర సలహాదారు, కోనాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడరపు రాంప్రసాద్ మాట్లాడుతూ గణితానికి సూత్రాలు, నిర్వచనాలు రెండు కళ్ళ వంటివన్నారు. గణిత శాస్త్రాన్ని వివిధ సబ్జెక్టులతో అన్వయించి నేర్చుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయుడు శ్రీధర్ సౌజన్యంతో పదో తరగతి విద్యార్థులకు గణిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. గణిత దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన క్విజ్ పోటీల్లో  విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు విద్యార్థుల సమక్షంలో ఉపాధ్యాయులుగణిత మేధావి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధర్మేందర్, అరవింద్, రామకృష్ణ, భాస్కర్,  గీత హిమవతి, రాజరాజేశ్వరి, పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -