Wednesday, November 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజాతీయ భావాలు గల విద్యావేత్త మౌలానా అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌

జాతీయ భావాలు గల విద్యావేత్త మౌలానా అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌

- Advertisement -

మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్‌
రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవం
నవతెలంగాణ-కల్చరల్‌

నెహ్రూ సమకాలికులు మౌలానా అబ్దుల్‌ కలం అజాద్‌ జాతీయ భావాలు గల విద్యావేత్త అని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్‌ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రధాన వేదికపై తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త లతీఫ్‌ ఖాన్‌కు మౌలానా అబ్దుల్‌ కలాం అజాద్‌ జాతీయ పురస్కారాన్ని మంత్రి ప్రదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. లతీఫ్‌ ఖాన్‌ మూడు దశాబ్దాలగా విద్య, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఉర్దూ భాష పరిరక్షణకు ఆయన చేసిన సేవలకు గుర్తింపు ఈ పురస్కారం అని అన్నారు. అకాడమీ వైస్‌ చైర్మెన్‌ నజ్రత్‌ ఖాన్‌ అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. జాతీయ పురస్కారంగా రూ.2 లక్షల 20 వేల నగదు, జ్ఞాపిక ప్రశంసాపత్రం అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమ ంలో అధికారులు అన్వర్‌, అహ్మద్‌, డాక్టర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -