- Advertisement -
– తాసిల్దార్, ఎస్సై, శాంతి సమావేశంలో విజ్ఞప్తి
నవతెలంగాణ-మద్నూర్ : డోంగ్లి మండలంలో గణేష్ వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జరుపుకోవాలని డోంగ్లి మండల తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ ఉమ్మడి మండల ఎస్సై విజయ్ కొండ మండల ప్రజలను విజ్ఞప్తి చేశారు డోంగ్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో అందరూ పండుగను శాంతియుతంగా జరుపుకోవడానికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్ఐ సాయిబాబా ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు గణేష్ మండపాల అధ్యక్ష కార్యదర్శులు పలువురు అధికారులు పాల్గొన్నారు
- Advertisement -