Monday, May 12, 2025
Homeజిల్లాలువికసించిన మే పుష్పాలు.. (ప్రకృతి వింత)

వికసించిన మే పుష్పాలు.. (ప్రకృతి వింత)

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల విశ్రాంత అచార్యులు సేర్ల దయానంద్, సేర్ల భాగ్యలక్ష్మి ల స్వ గృహం వినాయక్ నగర్ రోడ్ నెంబర్ 10 లోని నివాస గృహంలో మే పుష్పాలు వికసించాయి. ఇది ఒక ప్రకృతి వింత. ఈ పుష్పాలు కేవలం మే నెలలో మాత్రమే వికసిస్తుందని, పక్షం రోజుల తరువాత రాలిపోయి, కనుమరుగై పోతుందని సేర్ల దయానంద్ తెలిపారు. ఈ పుష్పలు అరేబియా దేశాల నుండి భారత దేశానికి తీసుకురాబడింది అని తెలిపారు. దీనిని పుట్బాల్ (Foot-Bal) పుష్పము అని కూడ అంటారు. ఇది ఎర్రని రంగులో ఉంటుంది. కావున అగ్ని పుష్పమనీ పిలుస్తారు. ఈ పుష్పము తమ గృహంలో 15 సం॥రాలనుండి వికసిస్తుందని తెల్పారు. ఈ పుషం చూడ ముచ్చటగా ఉండటంవలన కాలనీలోని ప్రజలందరూ చుట్టు ప్రక్కల వారు విచ్చేసి చూసి ఎంతో ఆనందిస్తున్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -