- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత అనుగ్రహం మండల ప్రజలపై ఉండాలని మండల తహశీల్దార్ రవికుమార్ అమ్మవారిని కోరారు. మండలం పెద్ద తుండ్ల గ్రామంలోని శ్రీహనుమాత్సహిత రాజరాజేశ్వర ఆలయం, గాదంపల్లి శ్రీ హనుమాన్ సహిత శివ పంచాయతన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దత్తాత్రేయ వారాహి అమ్మవారి ఆలయాల్లో ప్రతిస్థాపించిన దుర్గామాతకు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో అమ్మవారి మహాలక్ష్మి అవతారాన్ని దర్శించుకొని కమిటీ సభ్యులందరికీ కలిసి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -