నవతెలంగాణ – మల్హర్ రావు
దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దుర్గాదేవిని వేడుకొన్నారు. గురువారం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలతో కలిసి గణపతి హోమం, నవగ్రాహా హోమం, మహా చండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లోక మాత అయినటువంటి శ్రీ దుర్గా మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని కోరుకున్నట్టు తెలిపారు. అనంతరం వేద పండితులచి ఆశీర్వచనం తీసుకున్నారు.
దుర్గామాత ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES