ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి..
దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ప్రతిష్టాపనలో శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు: పంటలు బాగా పండి, పాడి,రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. మండలంలోని పెద్దతూoడ్లలోని హానుమత్సహిత రాజరాజేశ్వరి పంచాయతన దేవాలయంలో దత్తాత్రేయ స్వామి, గాధంపల్లిలో శ్రీ వీర సుబ్రహ్మణ్య స్వామి విగ్రహల ప్రతిష్టాపన మహోత్సవం మహోత్సవాలు సోమవారం అంగరంగవైభవంగా వెదపండితులచే ఆలయ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మహోత్సవానికి దుద్దిళ్ళ శ్రీను బాబు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.మంథని నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఆనందాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి దీవెనలు ప్రజల పైన నిండుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ, మాజీ సర్పంచ్ లు విజయ నాగేశ్వరరావు, రాజు నాయక్, మత్సశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ డివిజన్ నాయకుడు మండల రాహుల్, అడ్వాల మహేష్, రాజునాయక్, అధిక సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.
పంటలు బాగా పండి, రైతులు సుభిక్షంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -