Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజానాట్య మండలి మహాసభ జయప్రదం చేయండి..

ప్రజానాట్య మండలి మహాసభ జయప్రదం చేయండి..

- Advertisement -

ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి..
నవతెలంగాణ – మునుగోడు

నవంబర్ 25 న మునుగోడు మండల కేంద్రంలోని అమరవీరుల భవన్ లో నిర్వహించే ప్రజానాట్యమండలి డివిజన్ మహాసభ కు నియోజవర్గంలోని కళాకారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి కోరారు. శుక్రవారం మునుగోడు మండల కమిటీ సమావేశం సంపూర్ణ అధ్యక్షతన నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల ప్రజా చైతన్య ప్రవాహం ప్రజానాట్యమండలని అన్నారు. నీటికి చలనం ఉంటేనే ఏటికి వరదొస్తుంది. నిప్పున జ్వలనం ఉంటేనే గుప్పున మంటొస్తుంది అంటారు. సినారే నీటికి చైతన్యం-చలనం, నిప్పుకు చైతన్యం జ్వలనం ప్రకృతికైనా సమాజానికైనా ఈ చైతన్యమే పూర్వ గమన సాధనం. ఆ చైతన్యానికి ప్రతిరూపంగా 82 సంవత్సరాలు ప్రజల జీవితంలో విడదీయరాని భాగమై వ్యక్తికరించే సువిషాల మాధ్యమం ప్రజానాట్యమండలి అన్నారు. 

అక్కడ విజ్ఞానం, వికాసం, వినోదం, విషాదం, సంతోషం, సుఖం, దుఃఖం, సాహసం, సౌందర్యం వంటి అనేక చైతన్యాలకు దర్శిస్తాడు. మనిషి ఆ దర్శనం ఎంత విస్తృతమైతే ఎంత ఉన్నతమైతే చైతన్యం అంతటి ప్రవాహ వేగం అందుకుంటుంది. అది నేటికీ అతి ముఖ్య సామాజిక అవసరం అని వారన్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ జానపద కళాకారులకు తట్టి లేపేందుకు కళాకారుల్లోని చైతన్యాన్ని నింపేందుకు ప్రజానాట్యమండలి కళకళ కోసం కాదు.. కల ప్రగతి కోసం కల ప్రజల కోసమని నినాదంతో వీధి నాటకం పోరాట ఆయుధంగా మలుచుకుని ప్రజల్ని చైతన్యవంతం చేస్తుందని ఆయన అన్నారు.

నైజాం నిరంకుశంతో పై పాటలతో తూటాలై పేలిన ప్రజల్ని పోరాటంలో వైపు మళ్ళించింది ప్రజానాట్యమండలి అని తెలిపారు.  డిసెంబర్ 6 , 7 తేదీలలో జిల్లా మహాసభలు మాడుగుల పెళ్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. గ్రామీణ జానపద కళాకారులు ఆటపాట పల్లె సిద్ధులు డప్పుల దరువులు కోలాటం బుర్రకథలు ఒగ్గు కథలు పాటలతో సాంస్కృతిక జాతర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. డిసెంబర్ 6న మొదటిరోజు వెయ్యి మందితో  ప్రజాసంస్కృతిక జానపద ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. డిసెంబర్ 7న మహాసభ 500 మందితో నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ మహాసభలు విజయవంతం చేయాలని కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్  వరికుప్పల ముత్యాలు, ప్రజానాట్యమండలి  మండల కార్యదర్శి చిలుకూరి బిక్షం,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -