Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆటో డ్రైవర్ కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు

ఆటో డ్రైవర్ కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు

- Advertisement -

ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థినీలు 
నవతెలంగాణ – పాలకుర్తి

మండలంలోని పెద్ద తండా కె గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ లావుడియా భాస్కర్ జ్యోతి దంపతులకు కుమార్తె లావుడియా తులసి మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ చదివారు. నీట్ పరీక్షలు ప్రతిభను కనబరిచిన తులసి ఆల్ ఇండియాలో 247621 లక్షల ర్యాంకును సాధించి ఎంబిబిఎస్ సీటును పొందారు. తులసికి నల్లగొండ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు రావడంతో తులసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. భాస్కర్ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ తులసిని చదివించాడు. మండలంలోని తీగారం గ్రామానికి చెందిన పోగు శ్రావణి పదవ తరగతి వరకు మండల కేంద్రంలో గల ప్రగతి విద్యాలయంలో విద్యనభ్యసించారు.

హైదరాబాదులోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆల్ ఇండియా స్థాయిలో 1,58,000 ర్యాంకును సాధించగా రాష్ట్రస్థాయిలో 2860 ర్యాంకుతో 425 మార్కులు సాధించి మహబూబాబాద్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకున్నారు. శ్రావణి ఎంబీబీఎస్ సీటు సాధించడం పట్ల ప్రగతి విద్యాలయం ప్రిన్సిపాల్ వీరమనేని వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తూ శ్రావణిని అభినందించారు. పాలకుర్తి గ్రామానికి చెందిన పెనుగొండ కుశల హనుమకొండ లో గల ఎస్పిఆర్లో పదవ తరగతి చదివి హైదరాబాదులో గల శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. నల్లగొండ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించడం పట్ల విద్యార్థినిల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినీలను ఆయా గ్రామాల ప్రజలు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -