కస్తూర్బా ఆశ్రమ పాఠశాలను తనిఖీ చెసిన
మండల తహశీల్దార్ రవికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని మండల తహశీల్దార్ రవికుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో గురువారం మండలం దుబ్బపేట గ్రామపరిలోని కస్తూరి బాయి గాంధి ఆశ్రమ పాఠశాలను తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో తరగతి గదులు, వంటశాల, ఆహారం నాణ్యత, స్టోర్ రూము, కూరగాయలు నిల్వలు, హాజరు పట్టిక, ఆహారం తదితర వాటియొక్క నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని, ఈ సౌకర్యాలు వినియోగించుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. వసతి గృహంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులను వినియోగించాలని, నాణ్యత, లేని సరుకులు వాపసు చేయాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. కూరగాయలు ఓపెన్ గా ఉంచకుండా ఏదైనా కప్పి ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES